బొడ్డెమ్మ.. బొడ్డెమ్మా.. కోల్
-మొదలైన సంబరాలు -15 నుంచి ఎంగిలిపూలు -22న సద్దుల బతుకమ్మ
పిత్రు అమావాస్య(పెవూతమాస)కు ముందు చిన్నపిల్లలు ఆడుకునే బొడ్డెమ్మ సంబరాలతో బతుకమ్మ సందడి మొదలవుతుంది. చిన్నపిల్లలు, మహిళలు కలిసి, ఓ పీటపై ఎర్రమట్టితో అంతస్తులుగా, గుండ్రంగా బొడ్డెమ్మను తయారుచేస్తారు. రోజూ సాయంత్రం దాన్ని పూలతో అలంకరించి, దూప దీప నైవేద్యాలు సమర్పించి, బొడ్డెమ్మ చుట్టూ తిరుగుతూ చప్పట్లు కొడుతూ ఆడి పాడుతారు. బొడ్డెమ్మ పాటల్లో చందమామ ప్రస్తావన ఎక్కువగా ఉంటుంది. ‘బొడ్డెమ్మ బొడ్డెమ్మా కోల్, పిల్లాపూందరే కోల్’ అంటూ బొడ్డెమ్మకు ఆహ్వానం పలికి, ‘నివూదపో బొడ్డెమ్మ నిద్రపోవమ్మా.. నిద్రకూ నూరేళ్లు నీకు వెయ్యేళ్లు’’ అంటూ సాగనంపుతారు. రోజూ ఇలాగే సందడిగా నిర్వహిస్తారు. ఈ బొడ్డెమ్మ ఆట మహాలయ అమావాస్యతో పూర్తవుతుంది. అదే రోజు నుంచి చిన్న బతుకమ్మ సంబరాలు ప్రారంభమవుతాయి. తెలంగాణ సంస్కృతీ సంప్రదా యాలకు ప్రతీకగా నిలుస్తున్న బతుకమ్మ పండుగ వచ్చిందంటే పల్లెబాటలకు ఇరువైపులా పసుపు ఆరబోసినట్లు తంగేడు పూలు పరుచుకుంటాయి. కట్ల పూలు, ప్రతి ఇంటి గడప ముందూ కనిపించే మందారాలు, గుమ్మడి పూలు తెచ్చి బతుకమ్మను తీర్చిదిద్దుతారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పుష్పాలు అరుదుగా లభ్యమవుతుండడంతో, పల్లెల నుంచి పువ్వులను కొని తెచ్చుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా బొడ్డెమ్మ సంబరాలను పిల్లలు, యువతులు ప్రారంభించారు.
0 comments:
Post a Comment