WELCOME TO DEAR MANTHANITES,PLS JOIN THIS WEB SITE:మన మంథని information resource centre for entertainment (వినోదం), custom (సంప్రదాయ), cultural (సంస్కృతి), literary (సాహిత్య) and devotional (భక్తి) aspects of all Telugu people. Here you will find some information and devotional Songs. Also included is a separate Bhakti page with collection of all familiar stotras, slokas, pujas and vratas in audio and lyrics format..

ఉచితం.. ఉపయోగకరం














ఉచితం.. ఉపయోగకరం
సిటీబ్యూరో,టీమీడియా: శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకు విస్తరిస్తూ ప్రజలకు చేరువవుతోంది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, బ్యాంకులు, మొబైల్ కంపెనీలు తమ ప్రగతిని, కావాల్సిన సమాచారాన్ని కొత్త తరహాల్లో ప్రజల ముంగిట ఉంచేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈక్రమంలో టోల్‌ఫ్రీ నెంబర్లు అందుబాటులోకి వచ్చాయి. పైసా ఖర్చులేకుండా.. ఫోన్ చేస్తే కావాల్సిన సమాచారం మనకు చేరువవుతోంది. ఎక్కడి నుంచైనా సమాచారం తెలుసుకోవడం, సమస్యలను పరిష్కరించుకునేందుకు ఈ నెంబర్లు ఉపయోగపడుతున్నాయి. ఫిర్యాదులు చేసేందుకు, కావాల్సిన వస్తువును ఇంటికే నేరుగా తెప్పించుకోవడానికి దోహదపడుతున్నాయి. ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు సంబంధించిన టోల్‌ఫ్రీ నెంబర్ల వివరాలు మీకోసం అందిస్తున్నాం...

టోల్‌ఫ్రీ చరిత్ర...
sepటోల్‌ఫ్రీ నెంబర్లను ప్రపంచంలో మొట్టమొదటిసారిగా 1960లో బ్రిటన్‌లోని తపాలాశాఖలో ప్రవేశపెట్టారు. అయితే, వీటిని అమెరికన్లు ఖరీదైన హోటళ్లు, వివిధ వినియోగ సేవల్లో ఉపయోగించారు. ఆపై రాయ్ పీ వేబెర్ అనే అమెరికన్ కొన్ని మార్పులు తీసుకువచ్చి ప్రస్తుతం కొనసాగుతున్న వ్యవస్థను 197లో ప్రవేశపెట్టారు.

పోలీసుల కోసం 100...
sepపోలీస్‌స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేయకపోయినా, పోలీసుల వేధింపుల ఎక్కువైనా ఈ నెంబర్‌కు ఫోన్ చేయవచ్చు. పోలీసు ఉన్నతాధికారి కార్యాలయంలో ఈ నెంబర్ ఉంటుంది. 24 గంటల్లో ఎప్పుడైనా చేయవచ్చు.

ప్రమాదాలకు 108...
sepపిలిస్తే పలికే ఆపద్బంధువు 108 వాహనం. ఎక్కడి నుంచైనా ఫోన్ చేయవచ్చు. ప్రాణాపాయస్థితిలో ఎవరున్నా, ప్రమాదాలు జరిగినా, పాముకాటు, పురుటినొప్పులతో బాధపడుతున్నా ఈ నెంబర్‌కు ఫోన్‌చేసి సేవలు పొందొచ్చు.

‘మీ సేవ’ @ 1100...
sepఇటీవల ప్రవేశపెట్టిన ‘మీసేవా’ పథకం అమలు తీరును తెలుసుకునేందుకు ఈ నెంబర్‌ను ప్రభుత్వం ఉపయోగిస్తోంది. ఆయా ప్రాంతాల్లో ఈ పథకం అమలుతీరుపై సమస్య ఉంటే 1100 నెంబర్‌లో ఫిర్యాదు చేయవచ్చు. ఎక్కడైనా అసాంఘిక కార్యక్షికమాలు కొనసాగుతున్నా, మట్కా, జూదం, ఘర్షణలు, అనుమానస్పదంగా తిరిగే వ్యక్తులు కనిపించినా, నిందితుల సమాచారం ఇవ్వాలనుకున్నా ఈ నెంబర్ ఫోన్ చేయవచ్చు.

‘హెచ్‌ఐవీ’ జాగ్రత్తలకు 1997...
sepఎయిడ్స్ సంబంధిత వ్యాధుల గురించి తెలుసుకోవడానికి, హెచ్‌ఐవీ రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తల కోసం ఈ నెంబర్‌కు ఫోన్ చేయవచ్చు.

‘రైళ్ల’ సమాచారం 138,139...
sepరైల్వే రిజర్వేషన్లు, రైళ్ల రాకపోకల వివరాలు ఈ నెంబర్లకు ఫోన్‌చేసి తెలుసుకోవచ్చు. దీని ద్వారా స్థానిక స్టేసన్‌లో రిజర్వేషన్లు, సమయాలను పొందవచ్చు.

‘గృహహింస’పై 1091...
మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వేధింపులు గురించి ఫిర్యాదు చేయవచ్చు. గృహహింస, వరకట్న వేధింపులు, ఇతరుల ఇబ్బందులు ఈ నెంబర్‌లో వివరించవచ్చు.

లంచగొండి అధికారులంటే 155361...
అవినీతి, లంచగొండితనాన్ని రూపుమాపేందుకు ప్రతి పౌరుని వద్ద ఈ నెంబర్ తప్పనిసరిగా ఉండాలి. ఫోన్ చేస్తే ఏసీబీ అధికారులు లైన్‌లోకి వస్తారు. వీరికి తగిన సమాచారం ఇచ్చి అవినీతిపరుల ఆట కట్టించవచ్చు.

వేధిస్తే 1098...
వేధింపులకు గురవుతున్న మైనర్ల(6-14 సంవత్సరాలలోపు) కోసం ఈ నెంబర్‌ను ఏర్పాటు చేశారు. బాల, బాలికలు, ‘కిశోర బాలికలు’, గృహహింస, తల్లిదంవూడులు వేధిస్తున్నా, ఇష్టంలేని వివాహాలు చేస్తున్నా, కఠినమైన పనులు చేయిస్తుంటే ఈ నెంబర్‌కు ఫోన్‌చేస్తే అధికారులు సాయం అందిస్తారు.

భద్రతకు 181...
sepఢిల్లీ అచ్యాచార ఘటనతో కేంద్ర ఈ నెంబర్‌ను తాజాగా ప్రవేశపెట్టింది. మహిళలు ఎక్కడినుంచైనా ఈ నెంబర్‌కు ఫోన్ చేసి తమ ఫిర్యాదులు అందించవచ్చు.


ఓటర్ నమోదుకు 1950... 
ఓటరుగా నమోదు కావాలంటే ఈ నెంబర్‌కు ఫోన్ చేయవచ్చు. నమోదుకు కావాల్సిన సర్టిఫికెట్‌లు, ఇతర వివరాలకు తెలుసుకోవచ్చు. తొలగింపులు, మార్పులుచేర్పులు తెలుసుకోవచ్చు.

తూకాల్లో మోసాలు చేస్తే
160-4250-3333...
సరుకుల తూకాలలో మోసాలు ఉన్నట్లు గుర్తించినా, కల్తీ సరుకులు, ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయించినా ఈ నెంబర్‌కు ఫోన్ చేయవచ్చు.

ఆరోగ్య శ్రీ 1800-425-7788...
sepఆరోగ్యశ్రీ పథకంలో సేవల గురించి తెలుసుకోవచ్చు. ఈ పథకం ద్వారా ఎక్కడైనా సేవలు అందకపోయినా, క్షేత్రస్థాయి సిబ్బంది స్పందించకున్నా ఫిర్యాదు చేయవచ్చు.

ఆధార్ వివరాలకు 1800-180-1947...
sepఆధార్ కార్డుల కోసం రూపొందించిన నెంబర్. ఆధార్ నమోదు చేసుకున్న తరువాత ఈ నెంబర్‌కు ఫోన్‌చేసి స్టేటస్ తెలుసుకోవచ్చు. సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.

sep
పాస్‌పోర్టు కోసం 1800-258-1800...
విదేశాలకు వెళ్లడానికి కావల్సిన పాస్‌పోర్టును పొందేందుకు లేక దరఖాస్తు చేసుకున్నవారు తగిన సమాచారం కోసం ఈ నెంబరును సంప్రదించవచ్చు.

0 comments:

Post a Comment

 
Design by Mana Manthani Themes | Bloggerized by avadhanula prasad - Mana Manthani | manthani